హెచ్ఎండీఏ ప్రాంత అభివృద్ధి పై చర్చించిన భువనగిరి ఎమ్మెల్యే..

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి నియోజకవర్గంలోని హెచ్ఎండీఏ పరిధిలోని పట్టణాలపై శుక్రవారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి హైదరాబాద్ స్వర్ణ జయంతి భవన్లో హెచ్ఎండీఏ కార్యాలయంలో హెచ్ఎండీఏ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్ ని కలిసి భువనగిరి హెచ్ఎండీఏ ప్రాంత అభివృద్ధిపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన హెచ్ఎండీఏ ప్రాంత అభివృద్దిపై, భువనగిరి పట్టణంలో రోడ్ల సుందరీకరణ పోచంపల్లి, బీబినగర్, భువనగిరి చెరువులను మినీ ట్యాంక్ బండ్ల పనుల పురోగతిపై చర్చించారు.  మూసీ ప్రక్షాలనపై మూసీ రివర్ ఫ్రంట్ మేనేజింగ్ డైరెక్టర్ అమ్రపాలి తోను వేరువేరుగా చర్చించారు.