అనుచరులకు అసైన్డ్ భూములను అప్పగించిన మాజీ మంత్రి కేటీఆర్ 

– చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి
– మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రవీణ్ జే టోనీ
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
అసైన్డ్ భూములను తన అనుచరులకు అప్పనంగా అప్పజెప్పింది మాజీ మంత్రి కేటీఆరె నని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జలగం ప్రవీణ్ కుమార్ అన్నారు.తంగళ్లపల్లి మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో శుక్రవారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ…ప్రభుత్వ అధికారులను భయభ్రాంతులకు గురిచేసి, సబ్బండ వర్గాలను మోసం చేసిన చరిత్ర కల్వకుంట్ల కుటుంబనిదని ఆరోపించారు.తాను చెప్పిందే వేదంగా కేటీఆర్ పరిపాలన కొనసాగించారని విమర్శించారు.అధికార దుర్వినియోగానికి పాల్పడి వేలాది ఎకరాల అసైన్డ్ భూమిని తన అనుచరులకు కట్టబెట్టిండని మండిపడ్డారు.పీఏ మహేందర్ రెడ్డికి ఆదర్శ వివాహం చేసుకుంటే ఐదు ఎకరాల అసైన్డ్ భూమి ని మాజీ మంత్రి కేటీఆర్ కేటాయించడమెంటని ప్రశ్నించారు.ఆర్డిఓ కు ఆర్టీఏ యాక్ట్ ప్రకారం దరఖాస్తు చేస్తే..ఆదర్శ వివాహలు చేసుకున్న వారికి ఎక్కడ కూడా భూమి ఇవ్వలేదని వివరణ ఇచ్చారని తెలిపారు.5 మండలాల్లో వందల ఎకరాలను తన అనుచరులకు కేటీఆర్ కట్టబెట్టిండన్నారు.తన గుమాస్తా పత్రికలో పనిచేసే విలేఖర్లకు రెండు ఎకరాల చొప్పున అసైన్డ్ డ్ భూమిని కట్టబెట్టడంలో ఆంతర్యం ఏంటో కేటీఆర్ చెప్పాలని ప్రశ్నించారు. అర్హులైన విలేకరులందరికీ రెండు ఎకరాల చొప్పున భూమిని కేటాయించాలన్నారు.నువ్వు తప్పు చేసి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే ఊరుకొనే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా హెచ్చరించారు.అసైన్డ్ భూమిని ఎవరికైతే కేటాయించవో వాళ్లపై క్రిమినల్ కేసులకు సిఫార్సు చేయాలని డిమాండ్ చేశారు.లేదంటే కాంగ్రెస్ పార్టీ తరపున తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తం…మిగితా విలేకర్లకు న్యాయం జరిగే వరకు ఊరుకోమన్నారు.సమావేశంలో  జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి లింగాల భూపతి, ఎంపీటీసీ బైరినేని రాము, తంగళ్ళపల్లి పట్టణ అధ్యక్షులు నరసింగం గౌడ్, బీసీ సెల్ అధ్యక్షులు మల్లేశం యాదవ్, సోషల్ మీడియా అధ్యక్షులు గడ్డ మధుకర్ చోటు, నియోజకవర్గ యువత అధ్యక్షులు చుక్క శేఖర్, అధ్యక్షులు ప్రశాంథ్ కుర్మా, తిరుపతి యాదవ్, సత్తు శ్రీనివాస్, అరేపేల్లి బాలు, మిరాల శ్రీనివాస్, చందు, తిరుపతి ,చిలుక శ్రీనివాస్, శ్రీరామ్ పాల్గొన్నారు.