– బంధన్ బ్యాంక్ వెల్లడి
ముంబయి : తమ బ్యాంక్ ఆన్‌లైన్‌లోనూ ప్రత్యక్ష పన్నుల వసూళ్ల సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చిందని బంధన్ బ్యాంక్ తెలిపింది. దేశ వ్యాప్తంగా తమ కస్టమర్లతో పాటు ఇతర ఖాతాదారులు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చని పేర్కొంది. ఆదాయపు పన్ను శాఖకు చెందిన టిన్ 2.0 ప్లాట్‌ఫాం ద్వారా ఈ సేవలను అందించనున్నట్లు తెలిపింది. తమ 1700 పైగా శాఖల ద్వారా ఆఫ్‌లైన్‌లో కూడా ప్రత్యక్ష పన్నుల చెల్లింపులను స్వీకరిస్తున్నట్లు గుర్తు చేసింది.