ధరణి సమస్యలకు సత్వర పరిష్కారం..

– వచ్చే శనివారం వరకు అన్ని సమస్యలు పరిష్కరించాలి
– నల్లగొండ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి
నవతెలంగాణ నల్గొండ కలెక్టరేట్ : ధరణి పెండింగ్ సమస్యలను సత్వరమే పరిష్కస్తామని, క్లిష్టమైన సమస్యల పరిష్కారానికి ప్రత్యేక టీములను ఏర్పాటు చేశామని నల్గొండ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, సీసీఎల్ఏ ఇంచార్జ్  నవీన్ మిట్టల్ కు తెలిపారు. శనివారం నల్గొండ జిల్లా కలెక్టరేట్లో  ధరణి సమస్యలు, పరిష్కా రాలపై రెవిన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సిసిఎల్ఏ ఇంచార్జ్ నవీన్ మిట్టల్  వీడియో కాన్ఫరెన్స్  నిర్వ హించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పెండింగ్ లో ఉన్న  ధరణి అప్లి కేషన్లను త్వరితగతిన పరిష్కరించాలని  చెప్పగా ప్రిన్సిపల్   సెక్రటరీ  తెలుపగా నల్గొండ జిల్లాలో మండ లాల వారీగా గ్రామాల వారీగా  ధరణి సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ చూపు తున్నామని, త్వరలోనే జిల్లాలో ఉన్న పెండింగ్ సమస్య లను పరిష్కరిస్తామని తెలిపారు.  అనంతరం నల్గొండ జిల్లాలో ఉన్న  ఆర్డీవో లు, ఎమ్మా ర్వోలతో  కలెక్టర్ సి.నారాయణరెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిం చారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో వచ్చే వారాన్ని  ధరణి వారంగా  భావించి ధరణి సమస్య లను పరిష్కరించాలని కోరారు. ధరణి సమస్యల పరిష్కారంలో ఏమైనా సమస్యలు తలెత్తితే వెంటనే సంప్రదించాలని, వీలైనంత తొందరగా పెండింగ్ లేకుండా చూసుకోవాలని, అదే తరుణంలో తప్పులు చేయకుండా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వచ్చే శనివారం వరకు ఎటువంటి పెండింగ్ సమస్యలు లేకుండా అన్ని సమస్యలను పరిష్కరించాలని అన్నారు. వీటిలో కోర్టు కేసులు, నాలా కేసులు , పిఓబి కేసులు , రివర్స్ బ్యాక్  కేసులు అన్నింటిని  పరిష్కరించాలన్నారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రెవిన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, అడ్మినిస్ట్రేషన్ అధికారి మోతిలాల్, కలెక్టరేట్లోని రెవెన్యూ విభాగానికి చెందిన వివిధ శాఖల సూపరిండెంట్లు పాల్గొన్నారు.