జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి

– మైనారిటీ  జిల్లా అద్యక్షులు ఎండి. యాకూబ్ పాషా
నవతెలంగాణ – పాల్వంచ : జులై 1 సోమవారం నాడు  జిల్లాలోని కొత్తగూడెం క్లబ్ నందు నిర్వహించే “జాబ్ మేళా” ను సద్వినియోగం చేసుకోవాలని  భద్రాద్రి కొత్తగూడెం  మైనారిటీ సంక్షేమ సంఘం జిల్లా అద్యక్షులు ఎండి. యాకూబ్ పాషా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.1 వ తరగతి నుండి పిజీ వరకు విద్యార్హత కలిగి, 18 నుండి 35 సంవత్సరాల వయస్సు గల  నిరుద్యోగులు :https://forms.gle/aWH1uo5poS6RrT3D6.అనే వెబ్ సైట్ నందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని లేదా తమ‌ వెంట తప్పనిసరిగా 10  బయోడేటాలు (Resume) తీసుకుని ఉదయం 10 గం  నుండి సాయంత్రం 5  గంటల లోపు ఈ జాబ్ మేళాకు హాజరుకావాలని సూచించారు. ఇట్టి అవకాశాన్ని జిల్లాలోని నిరుద్యోగ మైనారిటీలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర సమాచారం కొరకు 8520860785  నంబర్ కు సంప్రదించాలని అన్నారు.