స్మైల్ స్కూల్ లో ఘనంగా ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్..

నవతెలంగాణ – ఆర్మూర్  
పట్టణంలోని స్మైల్ స్కూల్ ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్ శనివారం నిర్వహించడం జరిగింది. 2024 25 కు గాను కొత్తగా విచ్చేసినటువంటి చిన్నారులకు స్వాగతం పలకడానికి స్కూల్ యొక్క పిల్లలందరూ ఉపాధ్యాయులు మేనేజ్మెంట్ అందరూ కలిసి స్వాగతం పలికారు. చిన్నారులతోపాటు వారి యొక్క తల్లితండ్రులు గ్రాండ్ పేరెంట్స్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ షబానా గౌహర్ మాట్లాడుతూ.. దీనితో చిన్నారుల్లో ఒక ఉత్సాహం ఒక పండుగ వాతావరణంలో ఏర్పడింది. ఈ ఫ్రెషర్స్ డే చేయడానికి ముఖ్య కారణం ఏమిటంటే రేపు వారు స్కూల్ కి రావాలంటే ఉస్సాంతో హ్యాపీగా స్కూల్ కి వెళ్లాలని కోరుకోవాలని, స్కూలు అంటే భయం పోవాలని ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. టీచర్స్ అందరూ వాళ్లతో ఫ్రెండ్లీగా ఫ్యాన్లు మెంబర్స్ లా ప్రవర్తిస్తూ ఉండడం వల్ల వారు రెగ్యులర్గా సంతోషంగా స్కూల్ కి వస్తారని మా యొక్క అనుభవం అని అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రఫీ గౌహర్ స్టాప్ సింధూర సవిత ప్రసన్న స్వప్న శ్వేత సింధుజ రోజా శ్రావణి తదితరులు పాల్గొన్నారు.