సీఎం సాబ్‌…మీకిది తగునా?

”ఊర్లో ఎవడో చేతబడి చేసేటోడుం టాడు. ఆడు జనాల్ని సంపుతుంటే సూస్తూ ఊరుకుంటమా? చెట్టుకు కట్టేయమా? తాళ్లతో బంధించమా?” బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లను కాంగ్రెస్‌పార్టీలో చేర్చుకునే అంశంపై ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలివి. యాధృ చ్ఛికమో… అంతకు మించిన ఉదాహరణ దొరకలేదో… లేక మనసులోని మాటో… సొసైటీకి జరుగుతున్న చేటో….’చేతబడి’ పేరుతో కొందరు మూర్ఖులు చేసే దాడుల్ని ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీ వేదికగా సమర్థించడం ఏంటి? ఈ చేతబడులు, బాణామతుల పేరుతో ఇటీవల మళ్లీ తెలుగు రాష్ట్రాల్లో మూఢవిశ్వాసాలు పెరిగి, వరుస హత్యలు జరుగుతున్నాయి. వాటిని నివారించా ల్సిన ప్రభుత్వ అధినేత, దాన్ని ఉదాహరణగా తీసుకొని, దాడులు తప్పు కాదని సమర్ధించే పద్ధతిలో మాట్లాడటమే తప్పు. పదేండ్లు తెలంగాణలో ముఖ్యమంత్రి కుర్చీ తనదేనని చెబుతున్న రేవంత్‌రెడ్డి స్వరం ఇటీవలి కాలంలో మారుతున్నది. నిన్న మొన్నటి వరకు ప్రజాపాలన అంటూ సామా న్యులకు దగ్గరైన ఆయన ఇప్పుడు, మూఢవిశ్వాసాల ప్రస్తా వనలు తేవడం, పాతబస్తీ కరెంటును అదానీకి అప్పగించే నిర్ణయాలు తీసు కోవడంపై జనంలో చర్చ జరుగుతున్నది. ఎలాగూ 200 యూనిట్ల వరకు గృహవిద్యుత్‌ ఉచితంగానే సరఫరా చేస్తున్నారు. ఆ సొమ్మును ప్రభుత్వం డిస్కంలకు చెల్లించా ల్సిందే. అలాంటప్పుడు ఇక నష్టాలు ఎక్కడ అని విద్యుత్‌ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. కష్టమో నిష్టూరమో మాజీ సీఎం కేసీఆర్‌ విద్యుత్‌ సంస్కరణలు అమలు చేసేది లేదని తేల్చిచెప్పారని గుర్తు చేసుకుంటున్నారు. సీఎం సాబ్‌…జర సోంచాయించుర్రి!!
– ఎస్‌ఎస్‌ఆర్‌ శాస్త్రి