సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: డాక్టర్ గోపీనాథ్

నవతెలంగాణ – ధర్మసాగర్ 
 సీజనల్ పట్ల అప్రమత్తంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని స్థానిక మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గోపీనాథ్ ఆదివారం మండల ప్రజలకు సూచించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలంలో ఇంటి పరిసర ప్రాంతాలను గడ్డి పిచ్చిచెట్లు చెదారం లేకుండా ఏప్పటికప్పుడు తొలగిస్తూ, నీరు నిలవకుండా ఉండేలా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. వర్షాకాలంలో నీటి నిలువలతో మురుకునీరు చేరి దోమలు ఈగలు ప్రవల్లి ప్రమాదం ఉందని, వీటి వల్ల తినే ఆహారం కలుషితంగా మారి,కలరా,టైఫాయిడ్ వంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అంతేకాకుండా ఇంటి పరిసర ప్రాంతాలలో టైర్లు పాత ఇనుప చెవ్వలున్నటువంటి నిల్వలో ఉన్న వస్తువులలో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని అన్నారు. నిల్వ ఉన్న నీళ్ల వల్ల దోమల విపరీతంగా పెరిగే ప్రమాదం ఉందని, వాటి వల్ల బోదకాలు, విష జ్వరాలు విచృంభిస్తాయని వివరించారు. తినే ఆహారాన్ని  తాజాగా ఉండే కూరగాయలు,పౌష్టికాహారాన్ని అందించే ప్రతి వంటకాలను ఏ పూటకు ఆ పూటే వంట చేసుకుని వేడివేడిగా భుజించాలని అన్నారు. ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రతను  రెండు పూటలా స్నానాన్ని చేసుకొని ఉతికిన బట్టలను ధరించాలని సూచించారు. ఆరోగ్యంగా ఉండేందుకు ఆహారాన్ని భుజించే ముందు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కున్న తర్వాతే భుజించే విధంగా అలవాటుగా చేసుకోవాలని ప్రతి ఒక్కరు ఈ నియమాన్ని విధిగా పాటించాలన్నారు. రోగాలను దరిచేరకుండా ప్రతి ఒక్కరూ ఉదయం సాయంత్రం వ్యాయామాన్ని వాకింగ్ను యోగ ఆసనాలు వంటివి అలవాటు చేసుకుని దీర్ఘకాల వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తలు పాటించుకోవాలని సూచించారు.ఆరోగ్యమే మహాభాగ్యం అంతకుమించింది వేరొకటి లేదని ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరు శ్రద్ధాసక్తులను కలిగి ఉండాలని ఈ సందర్భంగా మండల ప్రజలకు సూచించారు.