నవతెలంగాణ – నెల్లికుదురు
2005 – 2006వ పూర్వ విద్యార్థి మండల కేంద్రానికి చెందిన పాము రాజేష్ కు జాతీయ అంతర్జాతీయ అవార్డు అందుకున్న రాజేష్ శాలువా తో ఘనంగా సత్కరించినట్లు ఉపాధ్యాయులు ఏం రవి నారాయణ యాకోబ్ రెడ్డి పార్వతి రాజిరెడ్డి రమేష్ శ్రీనివాస్ తెలిపారు. మండల కేంద్రంలో ఆదివారం అభినందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో నిరుపేద కుటుంబంలో పుట్టి కష్టపడి చదివి ఉన్నంత స్థాయికి ఎదగడం మాకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. మా శిష్యుడు పాము రాజేష్ నేషనల్ ఆర్టిస్ట్ గా అభివృద్ధి చెందినందుకు మా పాఠశాల నుంచి గర్విస్తున్నామని అన్నారు. కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగడం వల్ల సంతోష వ్యక్తం తెలియపరుస్తూ.. అతనికి శాలువతో ఉపాధ్యాయ బృందం ఘనంగా సన్మానించిన తెలిపారు. ఇప్పటికీ అతనికి ఉపయోగ అవార్డులు వచ్చాయని ,దీనిపట్ల తోటి స్నేహితులు హర్ష వ్యక్తం తెలిపినట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో గ్రామస్తుల పాల్గొన్నారు.