– మంచిర్యాల డీసీపీ భాస్కర్
నవతెలంగాణ-జైపూర్
మండల పరిధిలో నమోదవుతున్న కేసుల వివరాలు అడిగి తెల్సుకున్న మంచిర్యాల డీసీపీ భాస్కర్ గంజాయి నియంత్రణకు చర్యలు చేపట్టాలని సూచించారు. జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లుతో కలిసి ఆదివారం జైపూర్ పోలీస్‌స్టేషన్ సంధర్శించిన ఆయన స్టేషన్ ఆవరణ, పరిసరాలను పరిశీలించారు. అదేవిధంగా స్టేషన్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసు అధికారుల వివరాలను జైపూర్ ఎస్‌ఐ శ్రీధర్ వివరించారు. మండల పరిధిలో ఎలాంటి నేరాలు అధికంగా నమోదవతున్నాయని ఎస్‌ఐని అడిగి తెల్సుకున్నారు. అదేవిదంగా భీమారం పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ సీఐ మోహన్, భీమారం ఎస్‌ఐ రాములు ఉన్నారు.