మంత్రి పర్యటనలో ఫ్లెక్సీల లొల్లి

– పర్యటనను బహిష్కరించిన ఎమ్మెల్యే
నవతెలంగాణ-ఆసిఫాబాద్‌
జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం ఆసిఫాబాద్‌ నియోజకవర్గానికి వచ్చిన మంత్రి కార్యక్రమంలో ఫ్లెక్సీల లొల్లి కొనసాగింది. రెబ్బెన మండల కేంద్రంలోని పల్లె దవఖాన ప్రారంభోత్సవంలో భాగంగా ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే కోవలక్ష్మి అక్కడికి చేరుకోగా అక్కడ ఉన్న ఫ్లెక్సీలన్ని కాంగ్రెస్‌ పార్టీకి చెందినవి కావడంతో ఇది పార్టీ కార్యక్రమమా లేదా ప్రభుత్వ కార్యక్రమమా..? అని జిల్లా వైద్యాధికారి తుకారం బట్‌తో పాటు ఇతర అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు కనీసం ప్రోటోకాల్‌ పాటించడం లేదని ఇది సరైన విధానం కాదన్నారు. పార్టీ కార్యక్రమానికి తనను పిలవడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేసి కార్యక్రమాన్ని బహిష్కరించి తిరిగి జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. జిల్లా కేంద్రంలో డైట్‌ కళాశాల ప్రారంభోత్సవంలో కూడా ఎమ్మెల్యే పాల్గొనలేదు.