ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా చిన్నారుల బతుకులు మారేది ఎప్పుడు

నవతెలంగాణ – మద్నూర్
భారతదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా జీవితం కోసం ఎన్నో రకాల చట్టాలు తీసుకు వస్తున్నాయి. కానీ చెత్తకుప్పల్లో పని చేసే చిన్నారి బాల కార్మికుల బతుకులు మార్చడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమే అవుతున్నాయి. చట్టాలు తీసుకురావడం వాటి అమలు కోసం పకడ్బందీ చర్యలు చేపట్టకపోవడం ఎన్ని చట్టాలు ఉన్నా ప్రజల బతుకులు మారడం లేదు. అనడానికి చెత్తకుప్పల్లో తెల్లవార గానే కనిపించే చిన్నారి దృశ్యాలే నిదర్శనం కుటుంబ పాలన కోసం నిరుపేదలైన చిన్నారులు ప్రతిరోజు తెల్లవారుగానే గల్లి గల్లి తిరుగుతూ పాత ఇనుప సామాను సామాగ్రి వెతుక్కుంటూ ప్లాస్టిక్ సామాన్లతో వచ్చే కొద్దిపాటి డబ్బులతో బ్రతుకులు తీస్తున్నారు. జులై 1 నుండి కేంద్ర ప్రభుత్వం కొన్ని చట్టాలు అమల్లోకి తెచ్చింది. రాష్ట్రంలో బాల కార్మికుల నిర్మూలన చట్టం అమల్లో ఉన్నప్పటికీ అలాంటి చట్టాలు కాగితాలకే పరిమితం అవుతున్నాయి. సంబంధిత శాఖల అధికారులు బాల కార్మికుల నిర్మూలన పట్ల ఏమాత్రం చొరవ చూపకపోవడం నిరుపేద చిన్నారులు తెల్లవారగానే మురికి చెత్త కుప్పల్లో దర్శనం ఇస్తున్నారు. ప్రాణం చిన్నదైనా మూట పెద్దగా పనిచేసుకుంటూ పాత సామాగ్రి వస్తువులను అమ్ముకొని జీవనం గడుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం గానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ తీసుకువచ్చే చట్టాలు పకడ్బందీగా అమలయ్యే విధంగా ప్రజా సంక్షేమం కోసం పాటుపడవలసిన అవసరం ఎంతైనా ఉందని మండల ప్రజలు కోరుతున్నారు.