నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
కోదాడ, హుజూర్ నగర్ నియోజక వర్గాలలోని మున్సిపల్ పరిధిలో చేపట్టే పనులలో ఎక్కడకూడా రాజీ పడకుండా నాణ్యతా పరంగా పనులను చేపట్టాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సంబంధిత మున్సిపల్, కమిషనర్లు, ఇంజనీర్లను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మున్సిపల్ కమిషనర్లు, ఇంజనీర్లతో చేపట్టబోయే అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వచ్చే 3న రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖా మంత్రి వర్యులు నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి త్వరలో శంకుస్థాపనలు, చేపట్టనునందున అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. కోదాడకు రూ.20 కోట్లు, హుజూర్ నగర్ కి 10 కోట్లు అలాగే నేరేడు చర్లకు రూ. 5 కోట్లు కేటాయించినట్లు కలెక్టర్ తెలిపారు. కోదాడ మున్సిపాలిటీ మీటింగ్ హాల్ లో కోదాడ మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న పనులపై సమీక్షానిర్వహించారు. చేపట్టబోయే అన్ని పనులకు డి.పి.ఆర్. తయారు చేసి పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉంచాలని సూచించారు. కోదాడ లో రూ. 8 కోట్లతో మిని ట్యాంక్ బండ్ నిర్మాణం,అలాగే రూ. 6కోట్లతో కోదాడ టౌన్ హాల్ నిర్మాణం,రూ 50లక్షలతో ఖమ్మం x రోడ్ జంక్షన్ అభివృద్ధి,రూ.1.1 కోట్లతో ముఖద్వారాలు, రూ.4.4 కోట్లతో చెర్వుకట్ట బజార్ నుండి అనంతగిరి రోడ్డు వరకు మేజర్ ఔట్ పాల్ డ్రెయిన్ నిర్మాణాల పనులలో ఎక్కడ కూడా రాజీ పడకుండా పనులను నాణ్యతాపరంగా చేపట్టాలని సూచించారు.
అదేవిదంగా మంత్రి వర్యులు హుజూర్ నగర్ లో మినీ స్టేడియం స్థల పరిశీలన, హుజూర్ నగర్ మున్సిపాలిటీలో టి యు ఎఫ్ ఐ డి సి పనులపై సమీక్ష ,నేరేడుచర్ల మున్సిపాలిటీ లో టి యు ఎఫ్ ఐ డి సి పనులపై తదుపరి సమీక్ష నిర్వహింస్తారు.కావున ఆదికారులు పూర్తి నివేదికలతో సిద్దంగా ఉండాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో కోదాడ, హుజూర్ నగర్, నెరేడుచర్ల మున్సిపల్ కమిషనర్లు రమాదేవి, శ్రీనివాస్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఈ.ఈ జి.కె.వి. ప్రసాద్,ఈ.ఈ పబ్లిక్ హెల్త్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.