మెద్వదేవ్‌ ముందంజ

మెద్వదేవ్‌ ముందంజ– గాయంతో రిబకినా అవుట్‌
లండన్‌ : వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌లో రష్యా స్టార్‌ డానిల్‌ మెద్వదేవ్‌ శుభారంభం చేశాడు. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో ఐదో సీడ్‌ మెద్వదేవ్‌ 6-3, 6-4, 6-2తో అమెరికా ఆటగాడిపై వరుస సెట్లలో విజయం సాధించాడు. స్విస్‌ ఆటగాడు స్టానిస్లాస్‌ వావ్రింకా 6-3, 7-5, 6-4తో లోకల్‌ ఆటగాడిపై గెలుపొంది రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. బెరాటిని (ఇటలీ) 7-6(7-3), 6-2, 3-6, 6-1తో మార్టన్‌ (హంగరీ)పై గెలుపొందాడు. ఎనిమిదో సీడ్‌ కాస్పర్‌ రూడ్‌ 7-6(7-2), 6-4, 6-4తో ఆసీస్‌ ఆటగాడు బోల్ట్‌పై పైచేయి సాధించాడు. ఫోగ్నిని 6-1, 6-3, 6-5తో వరుస సెట్లలో ఫ్రాన్స్‌ ఆటగాడు లూకాను చిత్తు చేశాడు. మహిళల సింగిల్స్‌లో రిబకినా గాయంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆమె స్థానంలో క్వాలిఫయర్స్‌ నుంచి ఒకరికి అవకాశం లభించింది. ఏడో సీడ్‌ ఇటలీ అమ్మాయి జాస్మిన్‌ పావొలిని 7-5, 6-3తో వరుస సెట్లలో అలవోక విజయం సాధించింది. చైనా అమ్మాయి జాంగ్‌పై 6-3, 6-0తో దరియా విజయం సాధించింది.