నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వర్ని రోడ్డులోని శ్రీ రామ్ నగర్ కాలనీలో స్థానికులు సమస్యలపై నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్ కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుకు అనుగుణంగా నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్ స్పందించి కాలనీలో పర్యటించారు. స్థానిక ప్రజల ఫిర్యాదు మేరకు అక్కడ ఉన్న సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ నగర మేయర్ తో పాటు మున్సిపల్ సిబ్బంది, స్థానిక ప్రజలు తదితరులు ఉన్నారు.