ఈనెల 7న శిక్షణ తరగతులను జయప్రదం చేయండి..

నవతెలంగాణ – మునుగోడు
ఈనెల 7న మునుగోడు మండలంలోని కల్వకుంట్ల గ్రామంలో నిర్వహించే మునుగోడు నియోజకవర్గ సీపీఐ(ఎం) రాజకీయ శిక్షణా తరగతులకు నియోజవర్గంలోని గ్రామ , మండల కార్యదర్శులు కమిటీ సభ్యులు , పార్టీ నాయకులు పార్టీ సభ్యులు ప్రజా సంఘాల సకాలంలో హాజరై విజయవంతం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం కోరారు. మంగళవారం మండల కేంద్రంలో సీపీఐ(ఎం) కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై పోరాడడానికి ఈ శిక్షణ తరగతులు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల సహాయ కార్యదర్శి వరికుప్పల ముత్యాలు , జిఎం పీస్ జిల్లా అధ్యక్షులు సాగర్ల మల్లేష్, యాసరాణి శీను, వేముల లింగస్వామి, యాట యాదయ్య,  జేరిపోతుల ధనంజయ గౌడ్, హనుమయ్య, జి నరేష్, సైదులు తదితరులు పాల్గొన్నారు.