ర్యాకల శ్రీనివాస్ కు ఘన సన్మానం..

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
బీఆర్ఎస్ మండల  పార్టీ ఆధ్వర్యంలో  ఏషియా ఇంటర్నేషనల్ కల్చర్ అకాడమీ యూనివర్సిటీ ద్వారా డాక్టరేట్ పొందిన ర్యాకల శ్రీనివాస్ కి సన్మానం చేశారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు జనగాం పాండు మాట్లాడుతూ  ర్యాకల శ్రీనివాస్ ప్రజాసేవ చేయడం వలన తన సేవలను గుర్తించి ఏషియా ఇంటర్నేషనల్ కల్చర్ అకాడమీ యూనివర్సిటీ వారు డాక్టరేట్ ఇవ్వడం చాలా సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సుబ్బురు బీరు మల్లయ్య,  మాజీ మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన  ఆంజనేయులు, మాజీ వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, మాజీ సింగల్విండో చైర్మన్ ఎడ్ల సత్తిరెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షులు ఏవి కిరణ్,  మండల పార్టీ ప్రధాన కార్యదర్శి నీల ఓంప్రకాష్ గౌడ్, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్ రెడ్డి, మదర్ డైరీ డైరెక్టర్ కస్తూరి పాండు, నాయకులు కేశపట్నం రమేష్, కంచి మల్లయ్య, సందెల సుధాకర్ ,  సిల్వేరు ఏసు, పుట్ట వీరేశం, చుక్కల శంకర్ యాదవ్, రాంపల్లి నాగేశ్, నక్కల చిరంజీవి, సురేష్, కుతాడి సురేశ్,  బాతుక అశోక్ , పాశం మహేశ్,  జాంగీర్ పబ్బాల ఇస‌్తారి లు పాల్గొన్నారు.