నీటి తొట్ల శుభ్రత పట్ల ప్రజల హర్షం

నవతెలంగాణ – మద్నూర్
అధికారుల పాలనలో గ్రామ శుభ్రత పట్ల అధికారులు చేపడుతున్న చర్యలకు మద్నూర్ గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మద్నూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రథం గల్లి ప్రాంతంలో గల పశువుల నీటి తొట్టిని గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు అధికారుల ఆదేశాల మేరకు బుధవారం నాడు శుభ్రం చేశారు. పశువుల నీటి తొట్టి శుభ్రత పట్ల ఎప్పటికప్పుడు అధికారుల చర్యలు అభినందనీయమని గల్లీ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారిగా మండల అభివృద్ధి అధికారి రాణి గ్రామ కార్యదర్శిగా సందీప్ కుమార్ పాలన గ్రామ శుభ్రత పట్ల పకడ్బందీగా చేపట్టడంపై గ్రామస్తులు అధికారుల పనితీరుపై అభినందిస్తున్నారు.