మహిళా ద్రోహి కాంగ్రెస్ ప్రభుత్వం: మాధురి చంద్ర

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని కోరుతూ యాదాద్రి మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు మాధురి చంద్ర ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇన్చార్జి నాగేశ్వరావు కి మహిళా మోర్చా తరపున వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా  ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ఎన్నికల సందర్బంగా కాంగ్రస్ పార్టీ మహిళలకు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కి రోజుకో కొత్త కథ చెప్తూ కాలం వెళ్లదీస్తున్నారని, మహిళలకు ప్రతి నెల ఇస్తాం అన్న 2500 రూపాయలు ఇంతవరకు మొదలు కాలేదని, నవ వదువుకి ఒక లక్ష రూపాయలు , తులం బంగారం, కాలేజీ కి వెళ్ళే వారికి స్కూటీ ఇస్తామని హామీలు ఇచ్చి ఈరోజు కి అమలు కాకపోవడాన్ని తెలంగాణా బీజేపీ మహిళా మోర్చ తీవ్రంగా ఖండిస్తుందనారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకురాలు సుమిత్ర, జిల్లా కార్యదర్శి వైజయంతి, లక్మి, శ్రావణి, లాక్కకుల మాధవి, రేఖ, ఎం లక్ష్మి, నూనె మాధవి, రమ, మల్లిక, అర్చన, కీర్తి, కనకమ్మ, శైలజ, రమ్య, రేణుకా,వెంకటలక్ష్మిలు పాల్గొన్నారు.