ఎంపీటీసీల సేవలు మరువలేనివి: జెడ్పీటీసీ

నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
ఎంపీటీసీల పదవీకాలం బుధవారంతో ముగియడంతో బుధవారం రోజు మండల కేంద్రంలో గల మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీలకు వీడ్కలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ టేకులపల్లి వినీత తో పాటు తోటి ఎంపీటీసీలు మోతే శ్రీనివాస్,  మాధవి,  సుజాత,  గుర్రాల సుశీల,  ఊర లావణ్య, పుప్పల నారాయణ లకు జెడ్పీటీసీ మనోహర్ రెడ్డి శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఐదు సంవత్సరాలుగా ఎంపీటీసీలు గ్రామాలలో తమ వంతు సహాయ సహకారాలు ప్రజలకు గుర్తుండిపోయేలా చేశారని ఆయన అన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుని వెనువెంటనే సమస్యల పరిష్కారానికి ఎంపీటీసీలు ఎంతో కృషి చేశారని ఆయన అన్నారు. జిల్లాలో ఎక్కడి లేనివిధంగా ఎంపీపీ తోపాటు ఎంపీటీసీలతో కలిసి జెడ్పీటీసీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మండల స్థాయి అధికారులను ఆయన సన్మానించారు. కార్యక్రమంలో ఏ డి ఏ వీరస్వామి,  ఎంపీడీవో పరబన్న,  ఎంఈఓ వెంకటేశం,  ఏపిఎం జగదీష్,  మెడికల్ ఆఫీసర్ సుజన్ కుమార్,  ఏవో విజయ్ శేఖర్, ఏపీఓ సాయిలు, ప్రభుత్వ జూనియర్ కళాశాల నోడల్ ఆఫీసర్ షేక్ సలాం తో పాటు ఆయా శాఖల అధికారులు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.