నవతెలంగాణ – భువనగిరి
తెలంగాణ రాష్ట్ర వ్యప్తంగా ఉన్న ఆటో కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతూ వారి సమస్యల పరిష్కారానికి ఏఐటీయూసీ ముందు ఉంటుందని ఆటో మరియు ట్రాస్పోర్ట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందారపు వెంకటేశం తెలిపారు. బుధవారం స్వర్ణగిరి దేవాలయం వద్ద స్వర్ణగిరి ఆటో డ్రైవర్ యూనియన్ మరియు రేణుక ఎల్లమ్మ తల్లి ఆటో డ్రైవర్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధం) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన జెండా ను. బి వెంకటేశం ఆవిష్కరించారు. అనంతరం అయన మాట్లాడుతూ స్వర్ణ గిరి దేవాలయం ఏర్పాటు చేసిన తర్వాత భక్తుల రాకపోకలు అధికంగా ఉండడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. స్వర్ణగిరి దేవాలయం నుండి బొమ్మయిపల్లి అండర్ పాస్ వరకు మరియు రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం నుండి భువనగిరి చెరువు కట్ట వరకు ఉన్న సర్వీస్ రోడ్ ను వెడల్పు చేసి డివైడర్ లను ఏర్పాటు చేయాలని అయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టడంతో ఉపాధి కోల్పోయిన ఆటో కార్మికుల కుటుంబాలకు ప్రతి నెల రూ.10 వేలు ఇచ్చేంత వరకు త్వరలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు నిర్వహించినున్నట్లు అయన తెలిపారు.
భువనగిరిలో ఆటోలకు పార్కింగ్ స్థలం కేటాయించాలని, కొత్త బస్టాండ్ లో ఆటో స్టాండ్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వం ఆదుకోక పోతే వాహన రంగంపై ఆధారపడిన ఆటో డ్రైవర్ల బతుకులు రోడ్డున పడే ప్రమాదం ఉందని అయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు ఉపాధి అవకాశాలు కల్పించకపోవడంతో, చాలా మంది డిగ్రీలు, ఉన్నత చదువులు చదివి ఉపాధి దొరకకపోవడంతో కుటుంబాన్ని పోషించడం కోసం అప్పులు చేసి ఆటోలు కొనుక్కొని కుటుంబాన్ని పోషించుకుంటున్నారని అన్నారు. ఆటో డ్రైవర్లకు జీవనభృతి కింద నెలకు రూ.10 వేలు- ప్రభుత్వం ఇచ్చి ఆదుకోవాలని కోరారు. లేనిపక్షంలో ఆటో డ్రైవర్ల బతుకుల కోసం పోరాటం చేయవలసి వస్తుందని అయన అన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో తెలిపిన విదంగా ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డ్ వెంటనే ఏర్పాటు చేయాలని, ఇండ్లు లేని కార్మికలకు ఇండ్లు కట్టించి ఇవ్వాలని, జిల్లా వ్యాప్తంగా ఆటో కార్మికులకు ఎలాంటి సమస్య వచ్చిన వారికి అండగా నిలబడతామని అయన అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి, క్యాబ్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి బి తిరుమలేష్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గోరేటి రాములు, ఎండీ ఇమ్రాన్, జిల్లా కార్యవర్గ సభ్యులు సామల శోభన్ బాబు, ఆటో యూనియన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గనబోయిన వెంకటేష్ (రాణా), సామల భాస్కర్, జిల్లా కమిటీ సభ్యులు దాసరి లక్ష్మయ్య, స్వర్ణగిరి ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు గొర్ల లక్ష్మణ్, అధ్యక్షులు తారాల ఉపేందర్, ఉపాధ్యక్షులు గోపరాజు గణేష్, బింగి సురేష్, ప్రధాన కార్యదర్శిలు మర్రి శివ,, సుమన్, ప్రవీణ్, జహాంగీర్, మక్ బూల్, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.