మండలంలోని మామిడి పల్లి గ్రామంలో సీజనల్ వ్యాధులపై వైద్య శిబిరాన్ని జిల్లా వైద్యాధికారి తుకారాం రాథోడ్ అధ్వర్యంలో బుదవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు వైద్య సిబ్బంది, గ్రామ కార్యదర్శి గ్రామంలోని పరిసరాలను పరిశీలించారు. గ్రామంలో గల డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్నటువంటి వ్యక్తిని పరామర్శించి తను తీసుకోవలసిన తగు జాగ్రత్తలు వివరించారు. గ్రామంలోని దోమలు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కార్యదర్శికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అట్లాగే స్కూల్ జిల్లా పరిషత్ హై స్కూల్ ని సందర్శించి ఉపాధ్యాయులకు, సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థులకు సీజనల్ వ్యాధులు అంటే వర్షాకాలంలో వచ్చేటువంటి వ్యాధుల గురించి, వ్యక్తి గత శుభ్రత, హ్యాండ్ వాష్, దోమల నివారణ చర్యలు గురించి విపులంగా వివరించారు. దోమల పుట్టకుండా కుట్టకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిసరాల పరిశుభ్రత పై, చెత్త చెదారం లేకుండా చూడాలని తెలిపారు. గ్రామ కార్యదర్శికి, విడిసికి డెంగీ చికెన్ గునియా మలేరియా మొదలైన వ్యాధులు ప్రబలకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేశారు. ఈ శిబిరాన్ని పరిస్థితులను బట్టి శిబిరాన్ని కొన్ని రోజులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు ప్రకాష్ కుమార్, సిహెచ్ఓ ఆనంద్ కుమార్, ప్రవీణ్ రెడ్డి, భాగ్యలక్ష్మి, నారాయణ, సుజాత, సుధాకర్, సరిత, స్నేహ, శ్రీలేఖ, సూర్యకాంత్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.