సీఆర్ పీఎఫ్ జవాన్ కు ఘన స్వాగతం..

నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
మండల కేంద్రానికి చెందిన బర్ద్వల్ అమర్ సింగ్ నేడు ఉద్యోగ పదవీ విరమణ చేసి తన స్వంత గ్రామానికి చేరుకున్న సందర్భంగా ఆయనకు గ్రామస్థులు  మరియు కుటుంబ సభ్యులు ఘనంగా  స్వాగతం పలికారు. మండల కేంద్రంలోని కాటేపల్లి చౌరస్తా నుండి ఆయనకు కుటుంబ సభ్యులు నుదుట తిలకం దిద్ది పూల మాల వేసి  శోభ యాత్ర నిర్మాహించారు.ఈ శోభ యాత్ర కాటే పల్లి చౌరస్తా నుండి మొదలైన శోభ యాత్ర గాంధీ చౌక్ గుండా సాగుతు గ్రామస్థులు పూల మాల వేసి సన్మానించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాటశాల వద్ద  విద్యార్థులు ఉపాధ్యాయులు జై జవాన్ అనే నినాదాలు చేయడంతో ఆయన అభివాదం చేస్తు శోభ యాత్ర  ముందుకు సాగుతు  ఆయన స్వగృహనికి చేరింది..అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సౌదగర్ గంగారాం మాట్లాడ్తు అమర్ సింగ్ భారత సైన్యంలో చేరి నేటికి 39 సంవత్సరాలు పూర్తి చేసుకొని పదవి విరమణ మహోత్సవం చేసుకుంటునందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే కాకుండా  దేశ సరిహద్దులో  విధులు నిర్వహించాలంటే అంత తేలిక కాదని దేశం కోసం ప్రాణాలు అర్పించే సైన్యంలో ఆయన  సేవా చేసినందుకు ఆయనకు దేవుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉంచాలని అన్నారు.అంతే కాకుండా సైన్యంలో చేరినప్పటి నుండి ఆయన అనేక పదవులు అనుభవించి చివరకు సుబేదార్ మేజర్ గా పదవి విజయవంతంగా చేసుకొని  గ్రామస్థుల ఆదర్యంలో ఈ కార్యక్రమం నిర్మాహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం అమర్ సింగ్ దంపతులకు  శాలువా పులమలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు,బంధు మిత్రులు గ్రామస్థులు పాల్గోన్నారు.