బడి బాట కార్యక్రమంలో భాగంగా మండల స్థాయిలో ఏక రూప దుస్తులు, పాఠ్య పుస్తకాల పంపిణీ కార్యక్రమం డిచ్ పల్లి మండలం లోని మెంట్రాజ్ పల్లి ప్రైమరీ పాఠశాల లో బుధవారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ శ్రీ నర్సయ్య, వైస్ ఎంపీపీ సాయిలు , ఎంపిడిఓ రవీందర్, తహసిల్దార్ ప్రభాకర్, లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలనే మెరుగైన విద్య అందుతుందని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకే పంపించాలన్నారు. ప్రభుత్వం విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఇబ్బందులు కలగకుండా మధ్యాహ్న భోజనం దుస్తులు పాఠ్యపుస్తకాలను అందజేస్తుందని ఒక్క రూపాయి ఖర్చు లేకుండా విద్య పొందే విధంగా చర్యలు చేపడుతుందన్నారు. అనంతరం విద్యార్థులకు దుస్తులు, పాఠ్యపుస్తకాలను అందజేశారు.ఈ కార్యక్రమం లో ఎంపిటిసి సౌమ్య సుధీర్, సోసైటి చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ నవీన్,ఎపిఎం రజిత రెడ్డి, ప్రధానోపాధ్యాయులు సంధ్య నాయక్, రాజ్య లక్ష్మి, సంగీత, నాయకులు ధర్మా గౌడ్, నరేందర్ రెడ్డి , శ్రీనివాస్ గౌడ్, ప్రభాకర్, రాజన్న, శంకర్ గ్రామస్తులు పాల్గొన్నారు.