చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామంలో మండల పరిషత్ 2 లక్ష రూపాయల నిధులతో గ్రామంలోని రజకులకు ధోబి ఘాట్ ను మండల పరిషత్ అధ్యక్షులు తాడూరి వెంకట్ రెడ్డి జెడ్పీటీసీ చిలుకూరి ప్రభాకర్ రెడ్డి స్థానిక ఎంపీటీసీ తడక పారిజాత మోహన్ చేత బుధవారం ప్రారంభించారు. గ్రామంలోని రజకులకు వృత్తిపరంగా వారికి సకల సదుపాయాలతో బోరు మోటర్ అందుకు సంబంధించినటువంటి నీరు నిలువ చేసుకోవడానికి పెద్ద హౌస్ నిర్మించడం జరిగింది గ్రామ రజక సంఘ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్యదర్శి బ్రాహ్మణి గ్రామ మాజీ సర్పంచ్ గుండు మల్లయ్య మాజీ ఉపసర్పంచ్ పాలమాకుల యాదయ్య కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ఇంద్రసేనారెడ్డి గ్రామ రజక సంఘం అధ్యక్షులు పాలమాకుల నర్సింగ్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలమాకు నరసింహ గంగాపురం నాగేష్ సిపిఎం పార్టీ గ్రామ శాఖ సహాయ కార్యదర్శి యనమల సంజీవ,బుట్టి కృష్ణ,నిమ్మల నరసింహ, భావండ్లపల్లి స్వామి మరియు గ్రామ పెద్దలు పాలమాకుల పెంటయ్య పాలమాకుల జంగయ్య పాలమాకుల శంకర్ మాజీ వార్డు మెంబర్లు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.