గుండ్లోరిగూడెం గ్రామంలో నూతన రేషన్ షాప్ ప్రారంభం..

నవతెలంగాణ – మునుగోడు
మునుగోడు మండలంలోని గుండ్లోరిగూడెం గ్రామంలో ఇటీవల మంజూరు అయిన దొడ్డి సంతోష కొత్త రేషన్ షాప్ ను బుధవారం మునుగోడు తాసిల్దార్ నరేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ.. ప్రభుత్వం నుండి అందించే రేషన్ బియ్యం ను గ్రామంలోని ప్రజలకు వచ్చిన వెంటనే పంపిణీ చేసి ప్రజలలో మంచి గుర్తింపును సాధించాలని రేషన్ డీలర్ కు సూచించారు. అనంతరం డీలర్ దొడ్డి సంతోష మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం ఆనందంగా ఉందని అన్నారు. లబ్ధి దారులకు రేషన్ బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎమ్మార్వో నెలపట్ల నరేష్ ,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నారబోయిన రవి ముదిరాజు , బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాల్వాయి చెన్నా రెడ్డి , రేషన్ డీలర్ల సంఘం మండల అధ్యక్షులు ఉడుత సైదులు , జంగిలి నాగరాజు, వనం యాదయ్య , ఫీల్డ్ అసిస్టెంట్ సుదర్శన్ , బండారు మల్లేశం , సింగం నరసింహ , బొల్లం మహేష్ , కట్టెకుంట్ల నరేష్, మహేష్, నవీన్, వరకాల సైదులు మరియు తదితరులు పాల్గొన్నారు.