ఫారెస్ట్ అధికారులు బెదిరిస్తున్నారు..

– రాష్ట్ర మంత్రి శ్రీదర్ బాబుకు మహిళ రైతు రాజమ్మ వినతి
నవతెలంగాణ – మల్హర్ రావు
గత ముప్పై సంవత్సరాలుగా తాడిచెర్ల గ్రామపంచాయతీ పరిధిలోని,శాత్రజ్ పల్లి రెవెన్యూ శివారుల్లోగల సర్వే నెంబర్ 26 ప్రభుత్వ భూమిని సాగు చేసుకొని జీవిస్తున్న నేపథ్యంలో కొయ్యుర్ పారెస్టు అధికారులు హరితహారంలో భూమిలో మొక్కలు నాటుతామని బెదిరిస్తున్నారని,తనకు న్యాయం చేయాలని రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబుకు బుధవారం పెద్దతూoడ్ల గ్రామానికి చెందిన మంత్రి రాజమ్మ అనే దళిత మహిళ రైతు వినతిపత్రం  అందజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు కొన్నేళ్లుగా మూడెకరాల భూమి దున్నుకొని జీవిస్తున్న నేపథ్యంలో 2004 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం  అసైన్డ్ పట్టా జారీ చేసిందని,2019 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం డిజిటల్ పట్టా బుక్కు సైతం జారీ చేస్తే ప్రభుత్వం అంధించే రైతు బంధు పడుతుందన్నారు.ఇన్ని అదారాలున్న పారెస్టు అధికారులు భూమి అటవీశాఖధని బెదిరించడం జరుగుతుందని మంత్రి విన్నవించారు.ఉన్నతాధికారులను అదేశించి న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లుగా బాధిత మహిళ రైతు తెలిపారు.