అమ్మ ఆదర్శ పాఠశాలలో గుర్తించిన పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం పనుల పురోగతిపై విద్యాశాఖ, ఇంజనీర్లతో టెలి కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని 23 మండలంలో గుర్తించిన 330 పాఠశాలలో నిర్దేశించిన సమయానికి మైనర్ పనులు పూర్తి చేయాలని అట్టి మరమత్తుల పనులకై రూ. 6 కోట్ల 13 లక్షలకు పైగా నిధులు కేటాయించామని తెలిపారు. పనుల పురోగతులపై వారం వారం నివేదికలు అందచేయాలని, పనులు పారదర్శకంగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డి.ఈ. ఓ అశోక్, వివిధ శాఖల ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.