అశ్వారావుపేట సీఐ బదిలీ..

– ఐజీపీ కార్యాలయానికి అటాచ్డ్..
– విచారణకు వచ్చిన ఎస్.బీ సీఐ నాగరాజు..
నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట ఎస్ఐ శ్రీరాముల శ్రీను ఆత్మహత్యాయత్నం ఉదంతం నేపద్యంలో అశ్వారావుపేట సీఐ జితేందర్ ను బదిలీ చేస్తు బుధవారం ఐజీపీ ఉత్తర్వులు ఇచ్చారు. సాదారణ పరిపాలనా సర్దుబాట్లు లో భాగంగా 10 మందిని బదిలీ చేసి పోస్టింగ్ లు ఇచ్చినప్పటికీ జితేందర్ ను మాత్రం ఐజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఉత్తర్వులు వెలువరించారు. పార్లమెంట్ ఎన్నికలు బదిలీల్లో భాగంగా జితేందర్  కూసుమంచి నుండి మార్చి 3 న అశ్వారావుపేట బదిలీ పై వచ్చారు. ఈ క్రమంలో ఎస్.బి సీఐ నాగరాజు బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్ సందర్శించి విచారణ చేపట్టారు.