— ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
— మహాలక్ష్మి గుడి ఆవరణలో నూతన కరెంట్ స్తంభాల ఏర్పాటుకు భూమి పూజ..
నవతెలంగాణ – వేములవాడ
వేములవాడ పట్టణంలోని మహాలక్ష్మి అమ్మవారి గుడి ఆవరణలో సెస్ ఆధ్వర్యంలో నూతన కరెంట్ స్తంభాలను ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గురువారం భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ పట్టణంలో విద్యుత్తు సమస్యలు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రతీ ఏటా నిర్వహించే దసరా పండుగ వేడుకల సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి, అనంత పద్మనాభ స్వామి పల్లకి సేవ ఊరేగింపులో ప్రజలకు విద్యుత్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వర్షాకాలం సమయంలో చెట్లు కరెంట్ స్తంభాలను వ్యాపించి విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని, ప్రతీ ఏటా చెట్లను పెంచడం, నరికివేయడం జరుగుతుందని, అందువల్ల మున్సిపల్, సెస్ అధికారులు సమన్వయంతో ముందస్తు ప్రణాళికలతో చర్యలు చేపట్టాలన్నారు. అలాగే త్వరలో వనోత్సవం కార్యక్రమం ప్రారంభం అవుతుందని, అందువల్ల అధికంగా పెరిగే వృక్షాల మొక్కలను స్తంభాల వద్ద నాటకుండా చూడాలని, మోతాదు స్థాయి వరకు పెరిగే పూల మొక్కలు, పండ్ల మొక్కలు నాటలన్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవి, వైస్ చైర్మన్ బింగి మహేష్, కౌన్సిలర్లు ఇప్ప పూల అజయ్, పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పుల్కం రాజు, చిలక రమేష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.