
– దేశ విద్యారంగాన్ని అబాసుపాలు చేస్తున్న మోదీ..
– నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలి..
నవతెలంగాణ – మునుగోడు: అఖిలపక్ష విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో భారత్ బందు పిలుపునివ్వడంతో గురువారం బందు విజయవంతం అయింది.
మండల కేంద్రంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్యుఐ, డివైఎఫ్ఐ, ఏఐవైఎఫ్ సంఘాల ఆధ్వర్యంలో బందును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు కట్ట లింగస్వామి హాజరై మాట్లాడుతూ.. దేశంలో మోడీ విద్యారంగాన్ని భ్రష్టు పట్టించారని, పేపర్ లీకులు, స్కామ్ల్, పరీక్షలు రద్దు ద్వారా దేశ ప్రతిష్టను అంతర్జాతీయంగా పరువు తీశారని నీట్ పేపర్ లీకైందనే నిజాలను బీహార్ ఎర్పాటు చేసిన సిట్ తెల్చిందని, లీకైనట్లు నిందితులు అంగీకరించిన తర్వాత కూడా కేంద్రం విచారణ చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలలో ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి చాపల విప్లవ కుమార్, డివైఎఫ్ఐ మండల కార్యదర్శి యాసరాని వంశి కృష్ణ, ఎస్ఎఫ్ఐ నాయకులు యాసరాణి సాయి, పాలకురి సాయి కుమార్, ఎండి సిద్ధిక్,ఏఐవైఫ్ మండల నాయకులు బండారు శంకర్ , ఎన్ఎస్యుఐ నాయకులు తీగల శశి, భార్గవ్, ఉదయ్, మణికంఠ, శిరీష, జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.