– నిత్యం నరకమే
– గుంతలు పూడ్చండి సార్…!
నవతెలంగాణ – బొమ్మలరామారం
బొమ్మలరామారం నుంచి చీకటి మామిడి వెళ్లే దారిలో ఖాజీపేట సమీపంలో పెద్ద గుంత ఏర్పడింది.ఇతర గ్రామాల నుండి ఉద్యోగ నిమిత్తం పట్నం వెళ్లే ప్రధాన రహదారి, అంతేకాకుండా మండల కేంద్రానికి ప్రతిరోజు వెళ్లే అధికారులు గుంతను తప్పించుకొని పోవడం తప్ప, వరమ్మత్తులు చేసిన దాఖలు లేవు, ప్రతిరోజు వందల సంఖ్యలో వాహనాలు ఈ రహదారిపై తిరుగుతుంటాయి.గుంత వద్ద ద్విచక్ర వాహనాలు పల్టీ కొడుతున్నాయి. ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాలు మారిన గుంతల పరిస్థితి ఇంతేనా అని పలువురు వాపోతున్నారు. గుంతల మయంగా మారి అస్యవస్యంగా తయారయ్యే. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్డు ఇంకా పూర్తిగా దెబ్బతిని మరింత అద్వానంగా మారడంతో రోడ్డుపై ప్రయాణించాలంటేనే వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. అధికారులకు.ప్రజాప్రతినిధులకు ఎంత మొరపెట్టుకున్న ఎవరు పట్టించుకోవడంలేదని చెబుతున్నారు.ఈ రోడ్డుపై ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఉన్నతాధికారులు స్పందించి గుంతల మయంగా మారిన రోడ్లను బాగు చేయాలని ప్రయాణికులు ప్రజలు కోరుతున్నారు.
బీటీ రోడ్డు గుంతల మయమైన పట్టించుకోని అధికారులు
దాసరి పాండు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు
గుంతల మాయమై ఏళ్లు గడుస్తున్నా గాని అధికారులు పట్టించుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఇప్పటికి అనేక ప్రమాదాలు జరిగినయని వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధులు ఆ రోడ్డుపైన చూస్తూ వెళ్తున్నారని మరమ్మత్తులు నోచుకోరని గుంతల మయమైన రోడ్డుకు మరమ్మత్తులు చేపట్టడం కోసం బడ్జెట్లో కేటాయించి చేయడంలో ప్రభుత్వం అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారన్నారు.
– ఇబ్బందుల్లో వాహనదారులు
– సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ర్యాకల శ్రీశైలం
కాజీపేట బీటి రోడ్డు పై ప్రయాణం చేయాలంటే అరచేతిలో పెట్టి పోవాల్సి వస్తుందని, ఇప్పటికైనా వెంటనే బీటీ రోడ్డుకు బడ్జెట్ కేటాయించి రోడ్డును బాగు చేయాలని లేని పక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలను సమీకరించి ఆందోళన చేస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.