నవతెలంగాణ శంకరపట్నం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మండలాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు శంకరపట్నం మండల ప్రత్యేక అధికారిగా కరీంనగర్ జిల్లా, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ఎస్ నాగార్జున ను నియమించగా గురువారం శంకరపట్నం మండల ఎంపీడీవో కార్యాలయంలో బాధ్యతలను స్వీకరించారు.

ఈ సందర్భంగా ఎంపీడీవో ఎన్. శ్రీవాణి, ఎంపీఓ ఖాజా బషీరుద్దీన్, సూపరింటెండెంట్ శ్రీధర్ గౌడ్ లు ఆయనను సాదరంగా ఆహ్వానించి ఆయనకు శాలువాతో ఘనంగా సన్మానించారు. గ్రామపంచాయతీ కార్యదర్శులు నరసయ్య, ప్రదీప్,కిరణ్,హరీష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎంపీడీవో శ్రీ వాణితో కలిసి కరీంపేట గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలని సందర్శించి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ పనులను పరిశీలించారు. ఆయనతోపాటు మండల ఆర్ అండ్ బి ఏఈ, విఓ సల్మాలు పాల్గొన్నారు.