నవతెలంగాణ మునుగోడు : మునుగోడు మండలంలోని పులిపల్పుల గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు పందుల ఈదయ్య గత వారం రోజుల క్రితం మృతి చెందగా గురువారం ఆ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు ఆ కుటుంబాన్ని పరామర్శించి బిఆర్ఎస్ జిల్లా నాయకులు , సీనియర్ జర్నలిస్ట్ బొల్గురి నరసింహ 5వేలు ,బిఆర్ఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో 5వేల ఆర్థిక సహాయాన్ని అ కుటుంబానికి అందజేశారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈదయ్య మృతి బాధాకరం అని అన్నారు. ఏ ఆపద ఉన్న ఆ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు . ఈ కార్యక్రమంలో మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు వరంగంటి శంకర్ , మండల నాయకులు ధోటి కర్ణాకర్ , జనగాం నరసింహ , బొల్గురి శ్రీను , చందు కిరణ్ , గంగరాజు , నరేష్ , వరంగంటి ఊశయ్య , పందుల సైదులు తదితరులున్నారు.