నవతెలంగాణ తిరుమలగిరి: తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోనీ తెలంగాణ చౌరస్తా వద్ద దొడ్డి కొమురయ్య 78వ వర్ధంతి జిఎంపిఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.సాయిధ పోరాట తొలి అమరుడు కామ్రేడ్ దొడ్డి కొమురయ్య భూమికోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం నాడు నైజాం దేశము దొరలకు వ్యతిరేకంగా ఎర్రజెండా తమ బృందాలు స్పందాలపై మోస్తూ విరోచితమైన పోరాటాలు నిర్వహించిన చరిత్ర దొడ్డి కొమురయ్యకి ఉందనీ పలువురు అన్నారు.
విస్నూర్ దేశ్ ముఖ దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన చరిత్ర దొడ్డి కొమురయ్యదని పేద ప్రజల కోసం నిరంతరం ఉద్యమాలు నిర్వహిస్తున్న దొడ్డి కొమురయ్యను ఆనాడు నైజాముల కొమురయ్య మీద కాల్పులు జరిపారని ఆ కాల్పుల్లో వీర మరణం పొందిన దొడ్డి కొమురయ్య స్ఫూర్తితో ఈనాటి యువత ఉద్యమాలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందనీ చెప్పారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిఎంపిఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కడెం లింగయ్య, బహుజన యుద్ధనౌక ఏపూరి సోమన్న, యాదవ నవనిర్మాణ సమితి రాష్ట్ర నాయకులు బుక్కరాజు తిరుపతి, కడారి లింగయ్య, పానగంటి శీను, చేను శ్రీనివాసు, నలుగురి రమేష్, పత్తిపురం యాదగిరి, సామాజిక ఉద్యమ నాయకులు కందుకూరి ప్రవీణ్, చిత్తలూరి సోమయ్య, పులిమామిడి భిక్షం తదితరులు పాల్గొన్నారు.