ఇది మనందరి సినిమా

నివేదా థామస్‌, ప్రియదర్శి, విశ్వదేవ్‌, గౌతమి, భాగ్యరాజ్‌ లీడ్‌ రోల్స్‌లో నటించిన న్యూ ఏజ్‌ క్లీన్‌ ఎంటర్‌టైనర్‌ ’35-చిన్న కథ కాదు’. సురేష్‌ ప్రొడక్షన్స్‌, ఎస్‌ ఒరిజినల్స్‌, వాల్టెయిర్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్లపై రానా దగ్గుబాటి, సృజన్‌ యరబోలు, సిద్ధార్థ్‌ రాళ్లపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నంద కిషోర్‌ ఈమాని రైటర్‌, డైరెక్టర్‌. టీజర్‌ని విడుదల చేసి మేకర్స్‌ ప్రమోషన్స్‌ ప్రారంభించారు. విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథ నడుస్తుంది. యంగ్‌ ఏజ్‌లోనే విశ్వదేవ్‌ని పెళ్లాడిన నివేదా థామస్‌కి స్కూల్‌కి వెళ్లే అబ్బాయి ఉంటాడు. తను చదువులో పూర్‌. పాస్‌ మార్కులు (35) సాధించడంలో విఫలమవడంతో ఫ్యామిలీలో నిరాశకి దారితీసింది.దర్శకుడు నంద కిషోర్‌ హదయాన్ని కదిలించే భావోద్వేగాలతో అందరూ రిలేట్‌ చేసుకునే సబ్జెక్ట్‌తో ప్రశంసలు అందుకున్నాడు. భావోద్వేగాలు చాలా ప్యూర్‌గా వున్నాయి. ఆయన నెరేటివ్‌కి సమానంగా ఎంటర్‌టైన్మెంట్‌ ఉండేలా చూసుకున్నారు. డైలాగ్స్‌ ఇంపాక్ట్‌ ఫుల్‌గా ఉన్నాయి. టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో హీరో రానా దగ్గుబాటి మాట్లాడుతూ,’స్కూల్‌లో ఉన్నప్పుడు 35 అనేది నాకు పెద్ద పర్వతం లాంటింది (నవ్వుతూ). నందు ఈ కథ చెప్పినపుడు నాకు నేను గుర్తుకు వచ్చాను, మా అమ్మ గుర్తుకొచ్చింది. నా కోసం మా అమ్మపడిన కష్టం గుర్తుకు వచ్చింది. ఈ కథ వెళ్లి మా అమ్మకు చెప్పాను. ఇది మన అందరి కథ. చాలా మంది లైఫ్‌ ఇలా ఉంటుంది. ఈ కథని అందరూ రిలేట్‌ చేసుకుంటారు. చాలా కమర్షియల్‌ సినిమాలు వస్తుంటాయి. కానీ ఇలాంటి ప్యూర్‌ హార్ట్‌ వార్మింగ్‌ స్టొరీలు రావడం చాలా అరుదు. ఇలాంటి మంచి కథలు సురేష్‌ ప్రొడక్షన్‌లో చేయాలనేది మా ఉద్దేశం. ఆగస్ట్‌ 15న ఈ సినిమా రావడం చాలా అనందంగా ఉంది’ అని తెలిపారు. ‘ఇది చిన్న కథ కాదు. ఇది పెద్ద సినిమా.ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది’ అని డైరెక్టర్‌ నంద కిషోర్‌ ఈమాని చెప్పారు. నిర్మాత సజన్‌ యరబోలు మాట్లాడుతూ,’ ఈ సినిమా గొప్ప అనుభూతిని ఇస్తుంది. చాలా ప్రౌడ్‌గా ఫీలయ్యే కథ. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. ఇది మాకు మైల్‌ స్టోన్‌ మూవీగా నిలిచిపోతుంది’ అని అన్నారు. కథానాయిక నివేదా థామస్‌ మాట్లాడుతూ, ‘దర్శకుడు ఈ కథ చెప్పినప్పుడు చాలా థ్రిల్‌ ఫీల్‌ అయ్యా. ఎందుకంటే ఈ కథ నాకు బాగా రిలేట్‌ అయ్యింది. ఈ సినిమా తప్పకుండా కుటుంబ ప్రేక్షకులందరికీ కనెక్ట్‌ అవుతుంది’ అని తెలిపారు.