రేపు సహకార సంఘం అంతర్జాతీయ ఉత్సవాలు

– జెండా ఆవిష్కరణ కార్యక్రమం విజయవంతం చేద్దాం
– పాలకవర్గం సభ్యులు సకాలంలో హాజరు కావాలి: కార్యదర్శి బాబురావు
నవతెలంగాణ – మద్నూర్
ఈనెల 6న శనివారం మద్నూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయంలో ఉదయం 9- 30 నిమిషాలకు అంతర్జాతీయ సహకార ఉత్సవాల సందర్భంగా కార్యాలయ ఆవరణంలో జండా ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుందని, ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకార సంఘం కార్యవర్గ సభ్యులు సకాలంలో హాజరుకావాలని సంఘం కార్యదర్శి ఒక ప్రకటన ద్వారా కోరారు. అంతర్జాతీయ సహకార ఉత్సవాలు ప్రతి సంవత్సరం జూలై 6న జరుపుకోవడం జరుగుతుందని, కార్యవర్గ సభ్యులు అందరూ సకాలంలో హాజరు కావాలని కోరారు.