పీడీఎస్ బియ్యం పట్టివేత..

నవతెలంగాణ – గాంధారి

గాంధారి మండలంలోని కరక్ వాడి గ్రామంలో చిట్టి ప్యాకల సాయిలు అనే వ్యక్తి ఇంట్లో 15 క్వింటల్లా పీడీఎస్ బియ్యంని స్వాధీనం పరుచుకొని కేసు నమోదు చేశామని గాంధారి ఎస్.ఐ ఆంజనేయులు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్.ఐ ఆంజనేయులు మాట్లాడుతూ  గాంధారి మండల కేంద్రానికి చెందిన ఒడుసుల సంతోష్, పత్తి నవీన్  లు పి డి ఎస్ బియ్యాన్ని ప్రజల దగ్గర కిలోల చొప్పున సేకరించి,  అవన్నీ ప్లాస్టిక్ సంచులలో జమ చేసి, కరక్ వాడి లో ని సాయిలు ఇంట్లో పెట్టి గాంధారి కి చెందిన కందుకూరి వెంకటేశంకి అమ్మడం జరుగుతున్నదని పక్క సమాచారం మేరకు గాంధారి ఎస్.ఐ ఆంజనేయులు ఆధ్వర్యంలో పోలీసులు సాయిలు ఇంటిని సోదా చేసి అట్టి 15 క్వింటల్లా బియ్యాన్ని స్వాధీనం పర్చుకొని,  వారి పై కేసు నమోదు చేసి బియ్యంని సివిల్ యు సప్లై అధికారుల కి  అప్పజెప్పామని ఎస్.ఐ ఆంజనేయులు తెలిపారు.