నవతెలంగాణ – అశ్వారావుపేట
నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లో మినీ స్టేడియం నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ శుక్రవారం స్థలం ఎంపిక చేసారు. అశ్వారావుపేట – జంగారెడ్డి గూడెం రోడ్ లో గల నీటిపారుదల శాఖ కార్యాలయ భవన సముదాయం ప్రాంగణంలో గల ఖాలీ స్థలాన్ని గురువారం పరిశీలించారు. ఆయన వెంట తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్,సర్వేయర్ నాగరాజు, నాయకులు జూపల్లి రమేష్ ఆయన అనుచర వర్గం ఉన్నారు.