నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
ట్రాన్స్ జెండర్ స్వయం ఉపాధి శిక్షణ తరగతులు ముగించుకున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి చేతుల మీదుగా 26 మంది వికలాంగులు ట్రాన్స్ జెండర్స్ కి సర్టిఫికెట్లను ప్రధానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వయం ఉపాధి నైపుణ్య శిక్షణ అవకాశాలను పెంపొందించడం కోసం నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ హాస్పిటల్ మేనేజ్మెంట్ (NITHM) హైదరాబాద్ వారి సహకారంతో తెలంగాణ ప్రభుత్వం సుమారుగా రూ.10 లక్షల రూపాయలు వెచ్చించి వీరికి స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం వివిధ రంగాల్లో వారికి నైపుణ్యం ఇచ్చి ప్రోత్సహించడం జరుగుతుందని సమాజంలో లింగ వివక్షతను పోగొట్టడంలో భాగంగా వీరికి సమాన అవకాశాలను కల్పించడం వీరి జీవనోపాదులు మెరుగుపరిచి మీరు కూడా సమాజంలో భాగమే అనే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో ట్రాన్స్ జెండర్ కి వికలాంగులకు మెరుగైన అవకాశాలు కల్పించడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిని సక్కుబాయి, అదనపు జిల్లా సంక్షేమ అధికారి వేణు, ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ మునగాల నాగిరెడ్డి, ట్రాన్స్ జెండర్ నందిని, తనుశ్రీ, సితార తదితరులు పాల్గొన్నారు.