నవతెలంగాణ-శంకరపట్నం : శంకరపట్నం మండల కేంద్రంలో రోడ్డు విస్తరణలో భాగంగా పంచాయతీ సిబ్బంది వ్యాపారవర్తకులకు చిరు వ్యాపారులకు నోటీసులు అందించడం సరేంది కాదని రాష్ట్ర బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి జక్కని సంజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం సంఘం ఆధ్వర్యంలో మండల ఎంపీ ఓ బషీరుద్దీన్ కు వినతి పత్రాన్ని అందజేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ,చిరు వ్యాపారాలు చేసుకుని జీవించే కుటుంబం పోషణ భారంగా మారుతుందని రెక్క ఆడితే కానీ డొక్కాడని చిరు వ్యాపారులకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలనీ భవిష్యత్తులో బైపాస్ రోడ్డు పడుతున్నందువలన ఇక్కడ ట్రాఫిక్ తగ్గే అవకాశం ఉందని ముందుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వీధి స్తంభాలు గత ప్రభుత్వం నాటిన చెట్లు రోడ్డు పక్కనే ఉండడం వల్లన కూడా యాక్సిడెంట్ జరిగే ప్రమాదం ఉన్నందున ముందుగా వాటిని తొలగించి చిరు వ్యాపారులకు జీవనోపాధి కల్పించిన తర్వాత రోడ్డు విస్తరణ చేపట్టాలన్నారు.ఈ కార్యక్రమంలో బీసీ సంఘం మండలాధ్యక్షుడు అభిలాష్ బొంగోని, వ్యాపార వర్తక సంఘం అధ్యక్షుడు గజ్జల హనుమంతు, నాయకులు గుర్రం శ్రీనివాస్,సురేష్, చిరు వ్యాపారులు పాల్గొన్నారు.