బొగ్గు బావులను వేలం వేయవద్దని..

– కలెక్టర్ కు విన్నతి పత్రం..
నవతెలంగాణ-సూర్యాపేట కలెక్టరేట్ : కేంద్ర బిజెపి ప్రభుత్వం తలపెట్టిన బొగ్గు బ్లాక్ ల వేలం రద్దు చేయాలని, రాష్ట్రంలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాకు సింగరేణి కేటాయించాలని సిఐటియు  సూర్యాపేట జిల్లా నెమ్మాది వెంకటేశ్వర్లు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం కేంద్ర,రాష్ట్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన తెలియజేసి కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా నెమ్మాది వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బ్రిటిష్ కాలంలోనే ప్రభుత్వ రంగ సంస్థగా ఉందని, నాటి నుండి నేటి వరకు  కొనసాగుతున్న. ప్రభుత్వ రంగంలో కొనసాగుతున్న సంస్థ. కార్మికుల, ఉద్యోగుల కష్టార్జీతం తో లాభాల్లో కొనసాగుతుంది.కేంద్ర,రాష్ట్రాలకు పన్నుల రూపంలో  సుమారు8వేల కోట్లు చెల్లిస్తున్నది. ఈ పది సంవత్సరాల కాలంలో 49వేల కోట్లకు పైగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు  సింగరేణి సంస్థ చెల్లించింది. లాభాల్లో  నడుస్తున్న  సింగరేణి సంస్థను కార్పరెట్ శక్తులకు అప్పగించాలని  చూస్తున్నది. సింగరేణి సంస్థలో40వేల మంది రెగ్యులర్ ఉద్యోగులు, 26వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు   ఉపాధి పొందుతున్నారు. కోల్బెల్ట్ ఏరియాలో లక్షలాదిమంది  ప్రజలు పరోక్షంగాఉపాధి పొందుతున్నారు. బిజెపి ఎన్నికలకు ముందు  సింగరేణి సంస్థను కాపాడు తామని    చెప్పి నేడు బొగ్గు బావులనను వేలం వేయటం ఏమిటి అని ప్రశ్నించారు. సింగరేణి సంస్థను కాపాడుకోవడం కోసం ప్రజలందరూ  ఐక్యంగాఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో సీఐటియు జిల్లా అధ్యక్షులు యం. రాంబాబు, జిల్లా కమిటీ సభ్యులు యం. ముత్యాలు. వి. సైదయ్య, ట్రాన్స్ పోర్ట్ నాయకులు ఘంటా నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
సీఎం రేవoత్ రెడ్డి వికలాంగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి..
ఎన్నికల సమయంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాము అధికారంలోకి వస్తే వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు. చేనేత కార్మికులకు 6 గ్యారంటీల్లో. 4వేల రూపాయల పెన్షన్ అలాగే.
దివ్యాంగులకు కూడా 6000 రూపాయల పెన్షన్. అధికారంలోకి రాగానే డిసెంబర్ నుండి అమలు చేస్తామని హామీ ఇచ్చారు వెంటనే ఆమెన నిలబెట్టుకోవాలని ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు యాతాకుల రాజన్న మాదిగ అన్నారు.శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు వికలాంగుల తో నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు. డిసెంబర్ నెల నుండి పెంచిన పింఛన్ ఇవ్వాలని కోరారు.అలాగే వికలాంగులకు ఇచ్చిన హామీలు జీవో రూపంలో కాకుండా పూర్తిస్థాయిలో అమలు చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సూర్యాపేట నియోజకవర్గ ఇన్చార్జి ములకలపల్లి రవి మాదిగ ,వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ నాయకులు కర్ల విజయరావు,జిల్లా అధికార ప్రతినిధి పేరేల్లి బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం డి జహీర్ బాబా, మహిళ రాష్ట్ర నాయకురాలు రావి స్నేహలత చౌదరి ,వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షులు చింత సాంబయ్య, జిల్లా కార్యదర్శి మిద్దె సైదులు, జిల్లా నాయకులు పేర్ల సోమయ్య యాదవ్, గుండు శ్రీనివాస్ గౌడ్, గార్లపాటి వెంకట్ రెడ్డి, జిల్లా మహిళ నాయకురాలు దాచేపల్లి నాగమణి,ధారావత్ పద్మ,, నాయకులు కాలం శ్రీనివాసరావు, ఇంద్రాల పిచ్చయ్య, జంజీరాల సుధాకర్, తిప్పర్తి బిక్షం దున్నపోతుల కార్తీక్, శ్రీను,రామచంద్రు , జంపయ్య, ఉప్పనూతల నరసయ్య, గోపి, రాంబాబు, సొందు, నగేష్,తదితరులు పాల్గొన్నారు.