– విశాల్ ఫ్యాబ్రిక్స్ వెల్లడి
న్యూఢిల్లీ: తమ సంస్థ అత్యున్నత నాణ్యత కలిగిన డెనిమ్ ఫ్యాబ్రిక్స్‌ను సరఫరా చేస్తోందని విశాల్ ఫ్యాబ్రిక్స్ (చిరిపాల్ టెక్స్టైల్ మిల్స్) తెలిపింది. ఈ రంగంలో తాము విప్లవానికి నాయకత్వం వహిస్తున్నామని పేర్కొంది. అన్ని వయసుల వారికి ప్రీమియం స్ట్రెచ్ డెనిమ్ ఫాబ్రిక్ను అందిస్తుందని తెలిపింది. 2024 మార్చి 30 నాటికి చిరిపాల్ టెక్స్టైల్ మిల్స్‌లో మొత్తం రూ.158.02 కోట్లతో 37.72 శాతం వాటాను కొనుగోలు చేయడంతో తమకు అనుబంధ సంస్థగా మారిందని విశాల్ ఫ్యాబ్రిక్స్ పేర్కొంది.