నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావ్ జన్మదినం సంధర్భంగా శనివారం నాడు జుక్కల్ మండల కాంగ్రేస్ శ్రేణులు శనివారంనాడు ఘణంగా నిర్వహించారు. ఈ సంధర్భంగా జుక్కల్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేక్ కట్ చేసి, పుష్ప గుచ్చం అందించి శుఙాకాంక్షలు తెలిపారు. మండల కాంగ్రేస్ వర్కింగ్ ప్రసిడెంట్ అస్పత్ వార్ వినోద్, సీనీయర్ నాయకులు రమేష్ రావ్ దేశాయి ప్రత్యేకంగా ఎమ్మెలేను శాలువాతో సన్మానించి మిఠాయి తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాల నుండి కాంగ్రేస్ ప్రజాప్రతినిధులు భారీగా పాల్గొన్నారు.