నిజామాబాద్ జిల్లా కోర్టు ప్రాంగణంలో ఖాళీగా ఉన్న న్యాయాధికారుల పదవులను భర్తీ చేయాలని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ మోహన్ గౌడ్,తన సహచర బార్ ఉపాధ్యక్షుడు రాజు,ప్రధాన కార్యదర్శి వసంత్,కార్యదర్శి సురేశ్, కోశాధికారి దీపక్ లతో కలిసి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి పి.శ్రీసుధ కు వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు శనివారం అధికారిక పర్యటన నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ అతిధి గృహంలో బస చేసిన ఆమెకు తెలంగాణ రాష్ట్రం న్యాయమూర్తి రాష్ట్ర న్యాయ సేవా సంస్థ చైర్మన్ జస్టిస్ సుజోయ్ పౌల్ లను పుషగుచ్ఛం, శాలువ తో స్వాగతం పలికిన అనంతరం బార్ తరపున వినతిపత్రం సమర్పిస్తు పలు సమస్యల పరిష్కారించాలని కోరారు. మహిళలపై జరిగిన అత్యుచారాల కేసులను విచారించే న్యాయస్థానం,అదనపు సీనియర్ సివిల్ జడ్జి,ప్రత్యేక పొక్సో కోర్టు, 5 వ అదనపు ఫస్ట్ క్లాస్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ కొర్టులలో న్యాయాధికారులను నియమించాలని జగన్ విన్నవించారు. కోర్టుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో ప్రతినిత్యం వందలాది మంది కాక్షిదారులు, న్యాయవాదులు,కోర్టు సిబ్బంది మూలంగా వచ్చే వాహనాలు ప్రస్తుత జిల్లాకోర్టు ఆవరణ సరిపోక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొవడం జరుగుతున్న దని జగన్ తెలిపారు.జిల్లా కోర్టు అవసరాలరీత్యా ఓల్డ్ విద్యాశాఖ కార్యాలయ స్థలాన్ని న్యాయశాఖకు కేటాయించే విదంగా కృషి చేయాలని కోరారు. వినతిపత్రాన్ని పరిశీలించిన జస్టిస్ శ్రీసుధ సానుకూలంగా స్పందించారు. నిజామాబాద్ అదనపు జిల్లా జడ్జిగా, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గా విధులు నిర్వహించానని జిల్లాకోర్టులో ఉన్న సాదకభా దలు తెలుసని జస్టిస్ శ్రీసుధ తెలియజేస్తూ ప్రతి సమస్యను పరిష్కరించే విదంగా ప్రయత్నిస్తానని ఆమె బార్ ప్రతినిధి వర్గానికి హామీనిచ్చారు. ప్రతినిధి బృందంలో న్యాయవాదులు గోవర్ధన్, పడిగెల వెంకటేశ్వర్,మానిక్ రాజ్ .కవిత రెడ్డి,అరేటి నారాయణ తోపాటు జిల్లా ప్రధాన న్యాయూర్తి సునీతా కుంచాల రాష్ట్ర న్యాయ సేవా సంస్థ సభ్య కార్యదర్శి పంచాక్షరీ జిల్లా న్యాయమూర్తులు న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.