– ఉమ్మడి వరంగల్ జిల్లా శాఖ ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ కే జగన్ మోహన్..
నవతెలంగాణ –తాడ్వాయి:
2024-25 సంవత్సరానికై షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్ హైద్రాబాద్ లో నిర్వహించే సివిల్స్ ప్రిలిమినరీ, మెయిన్స్ (పదినెలల రెసిడెన్షియల్) ఉచిత శిక్షణ కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ ఉమ్మడి వరంగల్ జిల్లా శాఖ గౌరవ సంచాలకులు డాక్టర్ కె జగన్ మోహన్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 100 మందిని రాత పరీక్షల ద్వారా ఎంపిక చేస్తామని తెలిపారు. డిగ్రీ ఉతీర్ణులైన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు తేదీ జూన్ 17 నుండి జులై 10 వరకు www.tsstudycircle.co.inద్వారా దరఖాస్తులు చేసుకోగలరనీ, ప్రవేశ పరీక్ష తేదీ 27.07.2024 రోజున హైదరాబాద్ లో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రవేశ పరీక్ష లో పొందిన మెరిట్ ఆధారంగా అర్హులైన అభ్యర్థులకు ప్రవేశం కల్పించి ఎస్సీ స్టడీ సర్కిల్ బంజర హిల్స్ హైదరాబాదులో సివిల్ సర్వీసెస్ క్రిమినరీ పరీక్షకు ఉచిత వసతి భోజనంతో కూడిన శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. హైదరాబాద్లో ఉన్న రాష్ట్ర స్టడీ సర్కిల్ నందు ఈ సంవత్సరం ఉచిత శిక్షణ కొరకు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన, రూ.3 లక్షల కన్నా తక్కువ తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గల ఎస్సి , ఎస్టీ , బీసీ (బిసి -ఇ, pwd) లకు చెందిన ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని అన్నారు. ఎంపికైన అభ్యర్థులకు ఉచిత భోజనము వసతితో కూడిన పది నెలల కోచింగ్ ఇవ్వనున్నట్టు తెలిపారు.