– విద్యాశాఖ సంచాలకులకు బీసీటీఏ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పదోన్నతుల తర్వాత మిగిలిపోయిన ఖాళీ పోస్టులకూ వెంటనే పదోన్నతులు కల్పించాలని బీసీటీఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈవి నరసింహరెడ్డిని శనివారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె కృష్ణుడు నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. బదిలీ అయిన ఎస్జీటీలను వెంటనే రిలీవ్ చేయాలనీ, విద్యావాలంటీర్లను నియమించాలని కోరారు. బదిలీల ప్రక్రియలో జరిగిన సాంకేతిక సమస్యలను దృష్టిలో ఉంచుకుని రివర్షన్‌కు అవకాశం కల్పించాలని సూచించారు. పరస్పర బదిలీల ఉపాధ్యాయులు రెండేండ్లు పూర్తయినందున వారికి బదిలీ అవకాశం కల్పించాలని తెలిపారు. పండితులు, పీఈటీల అప్‌గ్రెడేషన్ కంటే ముందు ఖాళీగా ఉన్న 900 స్కూల్ అసిస్టెంట్ తెలుగు, హిందీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులకు అర్హత గల ఎస్జీటీలు, పండితులు, పీఈటీలకు పదోన్నతులు కల్పించాలని కోరారు.