ఇంటింటా ర్యాపిడ్‌ ఫీవర్‌ సర్వే

ఇంటింటా ర్యాపిడ్‌ ఫీవర్‌ సర్వేనవతెలంగాణ-నార్నూర్‌
మండలంలోని మాన్కాపూర్‌ గ్రామపంచాయతీ పరిధిలోని రాజుల గూడ గ్రామంలో డాక్టర్‌ రాంబాబు, వైద్యసిబ్బంది ఇంటింటా తిరుగుతూ ర్యాపిడ్‌ ఫివర్‌ సర్వే చేశారు. జ్వరం, జలుబు ఉన్న వారికి వైద్య శిబిరం నిర్వహించి, మందులు పంపిణీ చేశారు. వర్షకాలం నేపథ్యంలో ప్రతి గిరిజన గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు. గర్భిణీ, బాలింతలకు టీకాలు, గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. వైద్య శిబిరంలో ఎంఎల్‌హెచ్‌పీ సుశీల, హెల్త్‌ సూపర్‌వైజర్‌ చౌహన్‌ చరణ్‌దాస్‌, వైద్య సిబ్బంది గోకుల్‌, శిలా, జంగుబాయి, ఆడే నిర్మల ఆశాలు ఉన్నారు.