నవతెలంగాణ-శేరిలింగంపల్లి
హఫీజ్‌పేట డివిజన్ పరిధిలోని హుడా కాలనీ మె యిన్ పార్క్‌లో వాకర్స్‌కు, మహిళా సంఘాల వారికి, కాల నీ వాసులకు సీపీిఆర్ శిక్షణా కార్యక్రమాన్ని ఫ్రెండ్స్ అసో సియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో సిటిజన్ హాస్పిటల్, నల్లగండ్ల వారు నిర్వ హించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ ఎం. శ్రీ ధర్, హెడ్‌ఆఫ్ ది డిపార్ట్‌మెంట్, ఎమర్జన్సీ సర్వీసెస్ వా రు హాజరై మాట్లాడుతూ..మన శరీరంలో అత్యంత ము ఖ్యమైన అవయవము గుండె. ఇది శరీరంలో ఛాతి, ఊపి రితిత్తుల మధ్య ఉంటుందని గుండె ఆక్సిజన్, పోషకాలను రక్తం ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు సరఫరా చేస్తుం దన్నారు. అయితే మారిన జీవనశైలి, ఆహార అలవాట్ల వలన ప్రస్తుతం వయస్సు, లింగ భేదంతో సంబంధం లే కుండా చాలా మందిలో గుండె సంబంధిత సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. ప్రతిరోజూ వ్యాయామం చేస్తూ ఆరోగ్యంగా ఉన్న యువతలోనూ ఆకస్మిక గుండెపోటు రావడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న విషయమన్నారు. గుండెలోని రక్తనాళాలలో బ్లాకులు వల్ల రక్తప్రసరణకు అవరోధం ఏర్పడుతుంది. ఈ కారణంగా రక్తాన్ని గుండె సరిగా సరఫరా చేయలేకపోతుందన్నారు. దీని ఫలితంగా గుండెపోటు వస్తుందని ఇటువంటి పరిస్థితుల్లో ప్రథమ చికిత్స తెలిసి ఉండాలన్నారు. ఎవరైనా గుండెనొప్పితో ఇబ్బంది పడుతూ ఉంటే ఫస్ట్ ఎయిడ్ చేసేముందు అం బులెన్స్‌కు ఫోన్ చేయాలని తరువాత ఆస్పిరిన్ టాబ్లెట్ వేయాలన్నారు. ఎప్పుడైతే హార్ట్ ఎటాక్ ఎదుర్కొన్న వ్యక్తి ఊపిరి తీసుకోలేక పోతున్నాడో లేక పల్స్ అందడంలేదో అప్పుడు సీపీిఆర్ ప్రక్రియ చేయాలి. సీపీిఆర్ నిర్వహిం చేటప్పుడు కేవలం మీ చేతులను మాత్రమే గట్టిగా పుష్ చేయాలి. ఛెస్ట్ మధ్యభాగంలో పుష్ చేసేటప్పుడు కొంత వేగంగా పుష్ చేయాలి. నిమిషానికి 100 నుండి120 కంప్రెషన్ల వరకు చేయవచ్చు. ఇదే విధంగా అంబులెన్స్ వచ్చే వరకు లేదా మెడికల్ హెల్ప్ అందే వరకు చేయవ చ్చు. ఇలా చేసి ప్రాణాలను కాపాడవచ్చు. కాబట్టి దీనిపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండటం అవసరమని తెలిపా రు. వాకర్స్ అసోసియేషన్ నాయకులు దశరధ రామ య్య, ప్రభాకర రావు, జగన్ యాదవ్, కాళేశ్వర్ రావు ఫ్రెం డ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ధర్మసాగర్, బాలరా జు, కుమారి హస్పిటల్ ప్రతినిధి హరీష్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.