ఎస్ఐ శ్రీనివాస్ ది ముమ్మాటికీ కుల దురంకార హత్యే: పీక కిరణ్

నవతెలంగాణ – మల్హర్ రావు
ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్ ది ముమ్మాటికీ కుల దూరంకార హత్యగానే భావిస్తున్నామని ఉత్తర తెలంగాణ మాల మహనాడు అధ్యక్షుడు పీక కిరణ్ ఆరోపించారు. ఆదివారం కాటారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఎస్సై  మరణించడం చాలా బాధాకరం, ఆయన ఆత్మహత్యకు కారణమైన జితేందర్ రెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్, సిబ్బందిని కఠినంగా శిక్షించాలని, విధుల నుండి తొలగించాలని, ఎస్ఐ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకొని, కుటుంబంలో ఒకరికి  ఉద్యోగం, రూ. కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. న్యాయాన్ని కాపాడవలసిన పోలీసు వ్యవస్థలోనే ఇలాంటి కుల వివక్షత ఉండడం వారిని అనునిత్యం అవమానిస్తూ, ఇబ్బందులకు గురి చేస్తూ, విధులలో ఆటంకాలు చేస్తూ, చివరికి వారిని ఒంటరిగా చేసి ఆత్మహత్య చేసుకోవడానికి పురి గొలిపిన అశ్వరావుపేట పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.